సంతోషం పొంగింది – యేసు నన్ను రక్షించిన్

సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొర్లింది
హల్లేలూయా యేసు నన్ను రక్షించిన్ నా పాపం కడిగిన్ 
సంతోషం పొంగి పొర్లింది

1. త్రోవ తప్పి తిరుగుచుంటిని వాడి త్రోవలో నే పడియుంటిని

ఆయన నన్ను కరుణించెన్ తానే నన్ను రక్షించెన్

ఇంత మంచి యేసు నాకు సొంతమాయెనే

2. క్రీస్తు రక్తముతో నన్ను కడిగిన్ – నా పాపమంత తొలగిపోయెను

నాలో యేసు వచ్చెను నన్ను శుద్ధి చేసెను

ఇంత మంచి క్రీస్తు నాకు సొంతమాయెనే

3. నాదు ఆత్మతో సత్యముతో నా ప్రభువుని స్తుతియించెదన్

ఘనత ప్రభావముల్ మహిమలాయనకే

ఇంత మంచి యేసు నాకు దేవుడాయెనే

(Santhosham Pongindi – Yesu Nannu Rakshinchen)