శిలనైన నను శిల్పివై మార్చవు – నాలోని ఆశలు

శిలనైన నను శిల్పివై మార్చవు – నాలోని ఆశలు విస్తరింపజేసావు (2)

నీ ప్రేమ నాపై కుమ్మరించు చున్నావు (2)

నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి(2)

1.  మొడుబారిన నా జీవితం – నీ ప్రేమతోనే చిగురింపజేసావు (2)

నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2) – వర్ణించలేను లెక్కించలేను (2)

నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి(2)

2.  ఏ విలువ లేని అభాగ్యుడను నేను – నీ ప్రేమ చూపి విలువనిచ్చినావు(2)

నా యెడల నీకున్న తలంపులు విస్తారములు (2) నీ కొరకే నేను జీవింతు నిలలో(2)

నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి(2)

3. ఊహించలేను నీ ప్రేమ మధురం – నా ప్రేమమూర్తి నీకే నా వందనం

నీ ప్రేమే నాకాధారం నా జీవిత లక్ష్యం  (2) – నీ ప్రేమ లేక నేనుండలేను (2)

నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి(2)

(Silanaina Nannu Silpivai Maarchaavu Naaloni Aasalu)