రాలి పోదువో నీవు కూలిపోదువో తెలియదురా

రాలి పోదువో నీవు కూలిపోదువో

తెలియదురా నీకు ఏగడియో

పువ్వు రాలు విధమున రాలిపోదువో

“అను. పల్లవి”

అయ్యో! మానవా… మాయరా ఇది మాయరా

1. రేపు నీది కాదని తెలుసుకో – బుడగవురా నీవు బ్రతకవురా(2)

వట్టివిరా నీవు మట్టివిరా (2)

2. కోరకురా నీవు కోర్కెలనూ – ఉండవురా నీవు మన్నువురా(2)

కుండవురా నీవు పగిలెదవు (2)

3. నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని – ఎవ్వరు రారయ్య నీ వెంట(2)

ఎందరు ఉన్నా నీవొక్కడివే (2)

4. భార్యబిడ్డలు మాయరా – లోక నివాసులు మాయరా

మర్చిపోదురు ఒక్క దినమే (2)

5. శాశ్వతమా నీకు ఈ లోకం – శాశ్వతమయినది పరలోకం (2)

మరణించెరా ప్రభు నీ కోసం (2) అయ్యో!… మానవా!…

సత్యమురా ఇది సత్యమురా – సత్యమురా ఇది సత్యమురా

6. సిలువే శరణము మానవా – సిలువే మార్గము చూడవా (2)

ఇదియే తరుణము జేరవా (2) అయ్యో!… మానవా!…
సత్యమురా ఇది సత్యమురా – సత్యమురా ఇది సత్యమురా

(Raalipoduvo Neevu Kuulipoduvo Theliyaduraa Neeku)