రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను

రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను (2)
రాజులకు రారాజు మెస్సయ్యా (2)
రాజితంబగు తేజమదిగో (2)

1. దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగె-నీ దినమున (2)    “రారే”

2. కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానదే తేజరిల్లెడి (2)
తార గాంచరే త్వరగ రారే (2)    “రారే”

3. బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాలవృద్ధుల (2)
నేల గల్గిన నాథుడు (2)    “రారే”

4. యూదవంశము నుద్ధరింప
దావీదుపురమున నుద్భవించె (2)
సదమలంబగు మదిని గొల్చిన (2)
సర్వ జనులకు సార్వభౌముడు (2)    “రారే”

(Raare Choothamu Raajasuthuni Reyi Janana Maayenu)