రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా

రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2)

1. లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను
లోక నాథుడై మరియకవతరించెను (2)
ఇతండె దేవుడాయెను (6)          “రాత్రి”

2. బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము
యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2)
ఈ నాడే మనకు పండగ
రారండి ఆడి పాడగ (3)           “రాత్రి”

3. ఆకశాన తార ఒకటి బయలుదేరెను
తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2)
చిన్నారి యేసు బాబును
కళ్లారా చూసి మురిసెను (3)           “రాత్రి”

4. పొలములోని గొల్లవారి కనుల ముందర
గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2)
మేరమ్మ జోల పాడగా
జగాలు పరవశించెగా (3)           “రాత్రి”

5. లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను
భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2)
ఇతండె దేవుడాయెను (6)          “రాత్రి”

(Raatri Nedu Rakshakundu Velise Vinthagaa)