రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో

యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)

రావయ్య యేసయ్య – వేగరావయ్యా

రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2)

1.యేసయ్య రాకడ సమయంలో – ఎదురేగె రక్షణ నీకుందా? (2)

లోకాశలపై విజయం నీకుందా? (2)

2.ఇంపైన ధూపవేదికగా – ఏకాంత ప్రార్థన నీకుందా? (2)

యేసు ఆశించే దీన మనస్సుందా? (2)

3.దినమంతా దేవుని సన్నిధిలో – వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)

యేసు నాథునితో సహవాసం నీకుందా? (2)

4.శ్రమలోన సహనం నీకుందా? – స్తుతియించే నాలుక నీకుందా? (2)

ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)

5.నీ పాత రోత జీవితము – నీ పాప హృదయం మారిందా? (2)

నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2)

6.అన్నిటికన్నా మిన్నగను – కన్నీటి ప్రార్థన నీకుందా? (2)

ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2)


(Raakada Samayamlo Kadaboora Shabdamto)