రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము
1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు “రక్షకుండు”
2. గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త “రక్షకుండు”
3. వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు “రక్షకుండు”
4. పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె “రక్షకుండు”
5. అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2)
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు “రక్షకుండు”
(Rakshakundudayinchinaadata Mana Koraku Parama)