రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే (2)
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము (2)
సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము
2. మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్యము గల రాజు (2)
భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే
3. సముద్రము సృష్టించెనాయనదే సత్యుని హస్తమే భువిజేసెన్ (2)
ఆయన దైవము పాలితుల ఆయన మేపెడి గొర్రెలము
4. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము (2)
ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును
5. తండ్రి కుమార శుద్దాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు గాక (2)
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమెన్
(Randi Yuthsahinchi Paadudamu Rakhana Durgamu Mana Prabhuve)