యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన – నన్ను ప్రేమించినావు (2)
నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2)
ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో(2)
1. తల్లి గర్భమున నే ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2)
నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2)
2. మంచి నాలో పుట్ట – దంచు నీ వెరిగి నన్ మించ ప్రేమించి-నావు (2)
ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు (2)
3. నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి (2)
తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము (2)
4. నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2)
ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో
కేవలంబేమీ లేక (2)
(Yesu Nannu Preminchinaavu Paapinaina Nannu Preminchinaavu)