యేసు సామి నీకు నేను నా సమస్తమిత్తును

యేసు సామి నీకు నేను నా సమస్తమిత్తును
నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును

నా సమస్తము – నా సమస్తము
నా సురక్షగా నీకిత్తు నా సమస్తము

1. యేసుసామి నీకే నేను దోసిలొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్ యేసుచేర్చుమిప్పుడే

2. నేను నీవాడను యేసు నీవును నావాడవు
నీవు నేను నేకమాయే నీ శుద్దాత్మ సాక్ష్యము

3. నీకు నన్ను యేసు ప్రభూ ఈయనే నే యేగితి
నీదు ప్రేమ శక్తినింపు నీదు దీవెనీయవే

4. యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా హల్లెలుయా స్తోత్రము

(Yesu Saami Neeku Nenu Naa Samastamittunu)