యేసురాజు వచ్చుచుండె – హల్లేలూయ
ప్రభుల ప్రభువు వచ్చుచుండె – హల్లెలూయ
అ. పల్లవి|| హల్లేలూయ – హల్లేలూయా – హల్లేలూయ (4)
1. ఆర్భాటముతో అరుదెంచును – బూరధ్వనితో ఏతెంచును (2)
మహిమ శరీరం దాల్చెదము – మహిమలో నిత్యం నివసించెదము (2)
2. బహుమానములు ఎన్నో తెచ్చున్ – బహుగా తెచ్చున్ నా కొరకు ఆయనే (2)
కన్నీరంతా తుడుచును తానే – కన్న తండ్రిగా నన్ను ఆదరించును (2)
3. ఆనందమే మహదానందమే – ఆహాహహా ఆనందమే (2)
ఆనందమే ఆనందమే – యేసుతో నిత్యం మహదానందమే (2)
(Yesu Raaju Vacchuchunde Halleluya)