యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు
ఆనందముతో దినదినము – సంతోషముగ నుందురు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
1. వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరు
జీవజలపు నది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
2. చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకు
చేయి విడువక తనతో కూడ – యేసే నడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
3. చీకు చింతలు కలిగినను – చెరలు దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
4. నడి సంద్రములో పయనించినా – నట్లడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక – యేసే తోడుండును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా
(Yesuni Sthutiyinchuvaaru Nitya Jeevamu Nondedaru)