యేసయ్య నామం ప్రీతిగల నామం

యేసయ్య నామం – ప్రీతిగల నామం
సాటిలేని నామం – మధుర నామం

1. పాపము పోవును – భయమును పోవును
పరమ సంతోషము – భక్తులకీయును

2. పరిమళ తైలము – యేసయ్య నామం
భువిలో సువాసన – యిచ్చెడి నామం

3. మోకాళ్ళన్నియు – వంచెడి నామం
సూటిగా ఒకటిగా – ప్రకాశించె నామం

4. దివిలో భువిలో – యేసయ్య నామం
సైన్యాధిపతియగు – యేసయ్య నామం

5 నిన్న నేడు – మారని నామం
నమ్మిన వారిని – విడువని నామం

6. సాతాను సేనను – జయించెడి నామం
పాప పిశాచిని – తరిమెడి నామం

7. మధురం మధురం – యేసయ్య నామం
జీవము నిచ్చును – యేసయ్యనామం

(Yesayya Naamam Preethigala Naamam)