యేసయ్యా నా యేసయ్యా – ఎప్పుడయ్యా నీ రాకడ

యేసయ్యా నా యేసయ్యా – ఎపుడయ్యా రాకడ

యేసయ్యా నిన్ను చూడా ఆశయ్యా

రావయ్యా యేసయ్య రయమున

అ.ప. రమ్ము రమ్ము యేసునాధా వేగమె రారమ్ము

ఆమెన్‌ ఆమెన్‌ హల్లెలూయ ఆమెన్‌ హల్లెలూయ

1.చూచుటకెన్నో – వింతలున్నవి భువిలోన

చూడను ఎందరో – ఘనులున్నారు ధరలోన

ఏమి చూచిన – ఎవరిని చూచిన ఫలమేమి

నా కన్నులారా – నిన్ను చూడాలి యేసయ్యా

2.నా రూపమే మారునంట నిన్ను చూచువేళ

నిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చువేళ

అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా –

అందున్న సర్వసంపదలన్నీ – నా స్వంతమయ్యా

3.అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి

గొఱ్ఱెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న

అంధకారమే లేని ఆ – దివ్యనగరమందు

అవధులు లేని ఆనందముతో – నీతో ఉండెదను

(Yesayyaa Naa Yesayyaa Yepudayyaa Nee Raakada)