యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా

యేసయ్యా కనికరపూర్ణుడా – మనోహర ప్రేమకు నిలయుడా (2)

నీవే నా సంతోష గానము – సర్వ సంపదలకు ఆధారము (2) 

1. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి

     నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)

     సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి

     శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2)           “యేసయ్యా”

2. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు

     దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)

     అలసిన వారి ఆశను తృప్తిపరచితివి

     అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2)          “యేసయ్యా”

3. నీ వలన బలమునొందిన వారే ధన్యులు

     నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)

     నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు

     నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2)            “యేసయ్యా”

ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)

ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)  

(Yesayyaa Kanikarapoornudaa Manohara Premaku Nilayuda)