యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిదే లేదు లేమి కలుగదు

యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి
మాకు లేనిదే లేదు లేమి కలుగదు (2)

1. వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను –
ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)
మా ప్రాణములు సేదదీర్చేను –
నీతి మార్గమున నడిపించెను              “యెహోవా”

2. కారు చీకటిలో కన్నీరు తుడిచెను –
మరణ పడకలో ఊపిరి పోసెను (2)
మా తోడు నీడై నిలిచి నడిచెను –
శత్రు పీఠమున విందు చేసెను         “యెహోవా”

3. పరిశుద్ధాత్మలో ముంచి వేసెను –
పరమానందము పొంగిపోయెను (2)
పరలోకములో గొరియపిల్లను –
నిరతము మేము కీర్తింతుము            “యెహోవా”

(Yehova Maa Kaapari Yesayya Maa Upiri)