యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
1. మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2)
2. నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2)
3. సింహాల బోనైననూ సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2)
3. చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2)
4. పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2)
(Yehovaa Nee Naamamu Yentho Balamainadi)