యెహోవా నా కాపరి నాకు లేమిలేదు
పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్
1. మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్
2. పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను
3. నూనెతో నాతలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది
4. చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసమొందెదను
(Yehovaa Naa Kaapari Naaku Lemi Ledu)