మేలు చేయక నీవు ఉండలేవయ్యా

మేలు చేయక నీవు ఉండలేవయ్యా

ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2)

1. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా

     నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)

     నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2)

     క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది

2. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను

     పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)

     నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)

     నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి

3. పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను

     క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)

     నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)

     అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు

(Melucheyaka Neevu Undalevayyaa)