ముఖ దర్శనం చాలయ్యా – నాకు నీ ముఖ దర్శనం

ముఖ దర్శనం చాలయ్యా – నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)

సమీపించని తేజస్సులో – నివసించు నా దైవమా (2)

నీ ముఖ దర్శనం చాలయ్యా (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

1. అన్న పానములు మరచి నీతో గడుపుట

     పరలోక అనుభవమే – నాకది ఉన్నత భాగ్యమే (2)

     యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

2. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది

     మహిమలో చేరుటయే – అది నా హృదయ వాంఛయే (2)

     యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

3. కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి

     గానము చేసెదను – ప్రభువా నిత్యము స్తుతియింతును (2)

     యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

(Mukha Darshanam Chaalayyaa – Naaku Nee)