మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2)
1. పాప మమతల చేత – పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కూరుచు పంపుము క్షేమము (2)
ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము (2)
2. ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి (2)
దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు దారిని జూపుము (2)
3. దూర దేశములోన – బాగుందుననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల తరిమే దారిద్య్రము (2)
దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి ధన్యుని చేయుము (2)
4. అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు ఆకలి బాధలో
అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ అలవడెను వేదన (2)
అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము (2)
5. కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి
కూలివానిగనైన – నీ యింట పని చేసి కనికరమే కోరుదు (2)
కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము (2)
6. నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను (2)
నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును (2)
(Maargamu Chupumu Intiki – Naa Thandri Intiki)