మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతైయున్నది
1. మోడు బారిన జీవితాలను
చిగురింప చేయ గలవు నీవు
మారా అనుభవం మధురముగా – మార్చగలవు నీవు
2. ఆకు వాడక ఆత్మ ఫలములు –
ఆనందముతో ఫలియించనా
జీవ జలముల ఊటయైనా – నీ ఓరను నను నాటితివా
3. వాడ బారని స్వాస్థ్యము నాకై –
పరమందు దాచి యుంచితివా
వాగ్ధానఫలము అనుభవింప – నీ కృపలో నన్ను పిలచితివా
(Mahonnathudaa Nee Krupalo Nenu Nivasinchuta)