మహాత్ముడైన నా ప్రభు – విచిత్ర సిల్వజూడ

1. మహాత్ముడైన నా ప్రభు – విచిత్ర సిల్వజూడ నా

ఆస్తిన్ నష్టంబుగా నెంచి – గర్వంబణంగ ద్రొక్కుదున్

2. నీ సిల్వగాక యోదేవా – దేనిన్ బ్రేమింపనీయకు

నన్నావరించు సర్వమున్ – నీ సిల్వకై త్యజింతును

3. శిరంబు పాదహస్తమున్ – సూచించి దుఃఖ ప్రేమలు

మరెన్నడైన గూడెనా – విషాద ప్రేమలీగతిన్

4. ముండ్లన్ దుర్మార్గులల్లిన – కిరీట మేసు కుండినన్

ఈ భూకిరీటములన్ని – దానిన్ దూరంగ జాలునే

5. లోకంబు నే నర్పించినన్ – అయోగ్యమైన యీవియౌ

వింతైన యేసు ప్రేమకై – నా యావజ్జీవమిత్తును

6. రక్షింపబడ్డ లోకమా – రక్షింప చావు పొందిన

రక్షకుడేసును సదా – రావంబు తోడ గొల్వుమా
(Mahaathmudaina Naa Prabhu – Vichitra Silvajuda Naa Aasthin)