మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలిన మైన నాకై మనిషిగా దిగివచ్చావ (2)
నా మదిని కోవెలగా మలుచుకోవయా
నా హృదిలో రారాజుగా నిలిచిపోవయా (2)
1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము (2)
మనసు మర్మమెరిగినా మహనీయుడా
మనసు మార్చ గలిగినా నిజ దేవుడా (2)
2. చంచల మనసాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను (2)
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్థిరమనస్సుతో నీదారిలో సాగనీవయ్యా
3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీన మనసు తో నీ కడ శిరము వంచితి (2)
పూర్ణ శాంతి గల వానిగా నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా
(Manasunna Manchi Devaa Nee Manasunu Naakicchaavaa)