మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె (2)
1. తృణీకరింపబడె – విసర్జింపబడెను (2)
దుఃఖాక్రాంతుడాయె వ్యసనముల భరించెను (2) ||మనకై||
2. మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకు (2)
మన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె (2) ||మనకై||
3. గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్ (2)
అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును (2) ||మనకై||
4. దౌర్జన్యము నొందెను – బాధింపబడెను (2)
తననోరు తెరువలేదు – మనకై క్రయధనమీయన్ (2) ||మనకై||
(Manakai Yesu Maraninche Mana Paapamula Korakai)