మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమా
మందలో చేరని గొర్రెలెన్నో
రమ్మనే యేసు – ప్రార్ధించుము – నడిపించును
1.అడవులలో పలు స్థలములలో – నా ప్రజలెందుకు చావవలెన్?
వారి నిమిత్తమే శ్రమ పడితిన్ – మరి వారిని వెదకెడి వారెవరు ?
2. నాకై పలికెడి నాలుకలు – నావలె నడిచెడి పాదములు
నను ప్రేమించెడి హృదయములు – కావలె నాకవి నీవిచ్చెదవా?
(Mandalo Cherani Gorrelenno – Kotlakoladigaa Kalavu Ila)