ప్రేమ యేసయ్య ప్రేమా (4)
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)
1. తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)
2. నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2)
3. నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2)
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా
ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2)
(Prema Yesayya Prema – Maaranidi Maruvanidi)