ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం
ముదమార వశియించు నా హృదయాంతరంగమున
1. నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును (2)
పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి (2)
2. అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి (2)
కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి (2)
3. వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనే (2)
చేరితి నీదు దారి కోరి నడిపించుము (2)
4. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు (2)
ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయ రూపుండా (2)
(Priya Yesu Nirminchithivi Priyamaara Naa Hrudayam)