ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా – ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా – ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2)
1. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) “నా ప్రియుడా”
2. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) “నా ప్రియుడా”
3. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) “నా ప్రియుడా”
(Priyamaina Yesayyaa Premake Roopamaa)