ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
ప్రభు ప్రేమలో నిస్వార్ధమే వాత్సల్యమే నిరంతరం (2)
హాల్లేలూయా హాల్లేలూయా
హాల్లేలూయా ఆమేన్ హాల్లేలూయా (2)        

1. ఆకాశము కంటె ఎత్తైనది
మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)
ఆ సన్నిధే మనకు జీవమిచ్చును
గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)        “ప్రభు”

2. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు
ధరియింప చేయును ప్రభు సన్నిధి (2)
నూతనమైన ఆశీర్వాదముతో
అభిషేకించును ప్రేమానిధి (2)                      “ప్రభు”

(Prabhu Sannidhilo Aanandame Ullaasame Anudhinam)