పేద నరుని రూపము ధరించి యేసు రాజు నీ చెంత నిలచె

పేద నరుని రూపము ధరించి
యేసు రాజు నీ చెంత నిలచె
అంగీకరించు-మాయనను (2)      

1. కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్
ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2)
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందే తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలచుచుండె (2)      “పేద నరుని”

2. తల వాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను (2)       “పేద నరుని”

3. ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్
పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2)
నీ వ్యాధిని వేదన తొలగించ
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందే (2)       “పేద నరుని”

4. మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిల (2)
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో (2)       “పేద నరుని”

5. తామసించెదవేల ఓ ప్రియుడా
ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2)
ఈ లోకము నీకివ్వని శాంతిని
ఈ దినమే ప్రభువు నీకొసగ
ప్రేమతో నిన్ను పిలచుచుండె (2)       “పేద నరుని”

(Peda Naruni Roopamu Dharinchi Yesu Raaju Nee Chentha Niliche)