పరమందున  దూతలు పాడుచున్నారు

పరమందున  దూతలు పాడుచున్నారు

ఇహమందున భక్తులారా ధించు చున్నారు

స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునకే చెల్లును

హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ఆమెన్

1. సుందరులలో అతి సుందరుడు పదివేలలో అతి ప్రియుడు

కాంక్షనీయుడు కారుణ్యమూర్తి-కరుణతో మము బ్రోచెన్

2. శ్రేష్టులలో అతి శ్రేష్టుండు –మన ప్రభునకు సమమెవరు

చిందించె రక్తం – బలినిచ్చె ప్రాణం – పరమున నను చేర్చన్

3. పరిశుద్దుడు, అతి పరిశుద్ధుడు – నేత్రములే అగ్ని జ్వాలలు

జయించె సాతానున్, లోకమున్ గెల్చెన్ – జయశాలిగ నన్ జేసెన్

4. విశ్వమంత ప్రభు మహిమ నిండెన్ పాతాళపు శక్తులదిరెన్

భక్తులు లేచిరి బూరనూదగను – దేవునికే మహిమ

(Paramanduna Doothalu Paaduchunnaaru Ihamanduna Bhaktulaaraadhinchuchunnaaru)