నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్

నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)

అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను

1. కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (4)

2. ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరే భరువైనా – గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2)

3. అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (4)

4. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే (2)

(Nenellappudu Yehovanu Sannuthinchedanu)