నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ఆమెన్
1.ఆత్మతో నే పాడెదను – ఆర్భటించి పాడెదను – అభినయించి పాడెదను
అనుభవించి పాడెదను – అనుదినము నే పాడెదను – అందరిలో నే పాడెదను
2.యేసే నా మంచి కాపరి – యేసే నా గొప్ప కాపరి – యేసే నా ప్రధాన కాపరి
యేసే నా ఆత్మ కాపరి – యేసే నన్ను కొన్న కాపరి – యేసే నాలో ఉన్న కాపరి
3.శత్రు సేనలు ఎదురైనా – దుష్టులంతా ఒక్కటైనా – అజేయుడేసుని చేరెదము
విజయగీతము పాడెదము – ద్వజము నెత్తి సాగెదము – భజన చేయుచు పాడెదము
(Nuthana Geethamu Paadedanu Naa Priyudesunilo)