నీ సాక్ష్యము ఏది – నీ బలియర్పణ ఏది (2)
ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల
ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేల
మేల్కో లెమ్ము (2) రారమ్ము విశ్వాసి
1. అపోస్తుల కాలమందు – ఉపద్రవముల ఒత్తిడిలో (2)
అన్నింటి సహించుచు (2) – ఆత్మలాదాయము చేసిరి
2.కొరడాతో కొట్టబడిరి – చెరసాలయందుంచబడిరి (2)
చెరసాల సంకెళ్లును (2) – వారినాటంక పరచలేదు
3. కోత విస్తారమెంతో – కోత కోయువారు కొందరే (2)
యేసు నిన్ పిలచుచుండే (2) – త్రోసివేసెదవా ప్రభు పిలుపును
(Nee Saakshyamu Yedi Nee Baliyarpana Yedi)