నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2)
1. నీ తల్లి గర్భాన నీవుండినపుడే
నిను చూచే ప్రభు కన్నులు (2)
యోచించలేవా ఏ రీతి నిన్ను
నిర్మించే తన చేతులు (2) “నీ జీవితములో”
2. నీలోనే తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను (2)
హృదయంపు తలుపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను (2) “నీ జీవితములో”
3. తన చేతులందు రుధిరంపు ధారల్
స్రవియించే నీకోసమే (2)
భరియించె శిక్ష నీకోసమేగా
ఒకసారి గమనించావా (2) “నీ జీవితములో”
4. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి
సమయంబు యీనాడేగా (2)
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరీ “నీ జీవితములో”
(Nee Jeevithamulo Gamyambu Yedo Okasaari Yochinchavaa)