నీవు చేసిన మేలులు నేనెన్నడు మరువను నా జీవితకాలమంత నిన్నే స్తుతియింతును

నీవు చేసిన మేలులు నేనెన్నడు మరువను
నా జీవితకాలమంత నిన్నే స్తుతియింతును
నీకే నా ఆరాధన… నా యేసయ్యా, నీకే నా ఆరాధన

1. ఆరోగ్యమిచ్చావు, ఆనందమిచ్చావు
ఆత్మీయ ఫలములతో నడిపించుచున్నావు
ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుచున్నావు

2. కన్నీరు తుడిచావు, కష్టాలు తీర్చావు
కృపా క్షేమములతో నడిపించుచున్నావు
కృప వెంబడి కృపతో నడిపించుచూ ధైర్యపరచుచున్నావు

3. ప్రాణము పెట్టావు, ప్రేమను పంచావు
త్వరలో మాకై రానున్నావు
నా స్వాస్థ్యముగా పరలోకమును సిద్ధపరచియున్నావు

(Neevu Chesina Melulu Nenennadu Maruvanu Naa Jeevithakaalamantha)