నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేనుంటా యేసయ్యా
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా
1. ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైనను
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ
2. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అణగారినా
3. ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా
4. నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము
(Neevunte Naaku Chaalu Yesayya Neevente Nenu Vuntaanesayyaa)