నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు
నీలా క్షమియించేదెవరు యేసయ్యా
నీలా పాపికై ప్రాణంపెట్టిన వారెవరూ
1. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా
జీవ నదులన్నియు సర్వసంద్రములు ఒకటై ఎగసినా నిన్ను తాకాగలవా
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయా నీవేగా మంచి దేవుడవు
2. పలు వేదాలలో మతగ్రంధాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి
పాప పరిహారార్థం సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు
నీలా జాలికల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు
3. నేను వేదకకున్న నాకు దొరికితివి నేప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి
నీకు గాయాలు చేసి తరచూ రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి
లోక సౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించినా నీవేగా చాలిన దేవుడవు
(Neetho Samamevaru Neela Preminchedevaru)