నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

1. కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||

2. ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||

3. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||

4. వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||

(Ninne Ninne Ne Koluthunayya Neeve Neeve Naa Raajuvayya)