నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు
1. ఆపద దినములలో – నా ప్రభుని తలచితిని (2)
దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2)
2. ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2)
నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2)
3. లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2)
శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2)
4. ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2)
ఎల్లప్పుడు నే పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2)
5. మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2)
నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2)
(Naa Priayamaina Yesu Prabhu – Velaadi Sthotramulu)