నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం – నీకే నా జీవితం అంకితం
1. నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో
దాచియుంచలేను ప్రభు స్తుతియాగాముగా నూతన గీతము నే పాడెద
2. జ్ఞానులకు నీ సందేశం మతకర్తలకు నీ ఉపదేశం
అర్ధము కాకపోయెనె పతిత లెందరో నీ జీవజలములు త్రాగితిరే – త్రాగితిరే
3. నాయెడ నీకున్న తలంపులు బహువిస్తారములై యున్నవి
వాటిని వివరించి చెప్పలేనే
అవి అన్నియును లెక్కకు మించినవైయున్నవి – ఐ యున్నవి
(Naa Praana Priyudaa – Naa Yesu Prabhuvaa – Naa Jeevitham Ankitham)