నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది
నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది( 2)
నిరీక్షణ వైనందున నాకు నెమ్మదిగా వున్నది
ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది (2)
1. ధైర్యము కోల్పోయినా భయముతో మధి నిండిన
ఛీకటులే కమ్మినా – సాగలేమని తెలిసినా (2)
మా పితరులను నడిపించినా – నీ సామర్ధ్యం మాకు తెలిసినా(2)
మాకు ధైర్యముగా ఉన్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది(2)
2. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చినా
నూతన యెరూషలేములో మా పేరునే రాసినా (2)
మేఘస్తంభముగా నడిపించినా – నీ మహిమనే చూపించిన(2)
నీలో ఏకమవ్వలనే నీరిక్షణ మాకున్నది (2)
(Naa Kaaparivainanduna Naaku Dhairyamugaa Vunnadi)