నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా
నీదే నీదే బ్రతుకంతా నీదే
1. నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్య
2. నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్య
(Naadantu Lokaana Yedi Ledayyaa – Okavela Vundante Neevicchinade Prabhuvaa)