నాతో నీవు మాట్లడినచో నే బ్రతికెదను ప్రభో

నాతో నీవు మాట్లడినచో నే బ్రతికెదను ప్రభో

నా ప్రియుడా నాహితుడా నాప్రాణనాధుడా నా రక్షకా

1.తప్పిపొయినాను తరలి తిరిగినాను దొడ్డి నుండి వేరై హద్ధు మీరినాను

లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్ ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్మం (2)

ఒక్క మాట చాలు (3) ప్రభో . .

2.యుద్దమందు నేను మిద్దెమీదనుండి చూడరాని ద్రశ్యం కనుల గాంచినాను

బుద్ది వీడినాను హద్దు మీరినాను లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం (2)

ఒక్క మాట చాలు (3) ప్రభో . .

3. కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము (2)

గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి  దిక్కు లేక నేను దయను కోరుచుంటి

ఒక్క మాట చాలు (3) ప్రభో . .

(Naatho Neevu Maatlaadinacho Ne Brathikedanu Prabho)