నాకెన్నో మేలులు చేసితివే – నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును
అను. పల్లవి:
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే
1. కృప చేత నన్ను రక్షించినావే – కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే – నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే
2. నాకిక ఆశలు లేవనుకొనగా – నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప – నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే
3. నా కాడి మోసి నా తోడు నీవే – నీ చేతి నీడలో – నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి – నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే
4. నీ రాజ్యమందు నను చేర్చుకొందువు – రానున్న రారాజువు – నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు-నను కొన్నవాడవు-నా వరుడవు నీవు
(Naakenno Melulu Chesithive Neekemi Chellinthunu Deva)