నడిపించు నా నావ – నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున – నా జన్మ తరియింప
1. నా జీవిత తీరమున – నా అపజయ భారమున
నలిగినా నా హృదయమును – నడిపించుము లోతునకు
నా ఆత్మ విరబూయ – నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము – నా సేవ జేకొనుము
2. ఆత్మార్పణ చేయకయే – ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే – అరసితి నీ కలిమి
ఆశ నిరాశాయే – ఆవేదనేదురాయే
ఆధ్యాత్మిక లేమిగని – అల్లాడే నా వలలు
3. ప్రభు మార్గము విడచితిని – ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని – పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో – ప్రావిణ్యమును బొంది
ఫల హీనుడనై యిపుడు – పాటింతు నీ మాట
4. లోతైన జలములలో – లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి – లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో – లోతైన నా బ్రతుకు
లోపించని యర్పణగా – లోకేశ చేయుమయా
5. ప్రభు యేసుని శిష్యుడనై – ప్రభు ప్రేమలో పాదుకుని
ప్రకటింతును లోకములో – పరిశుద్దుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో – పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు – పానార్పణము జేతు
(Nadipinchu Naa Naavaa Nadisandramuna Devaa)