దేవుని వారసులం ప్రేమ నివాసులము

దేవుని వారసులం ప్రేమ నివాసులము

జీవన యాత్రికులం యేసుని దాసులము

నవ యుగ సైనికులం – పరలోక పౌరులము

హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము

1. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటకే

విజేత ప్రేమికులం – విధేయ బోధకులం

నిజముగ రక్షణ ప్రబలుటకై

ధ్వజముగ సిలువను నిలుపుదుము (2)

2. ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా

విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల

శుభములు గూర్చుచు మాలోన

శోభిల్లు యేసుని చూపుదుము (2)

3. దారుణ హింసలలో దేవుని దూతలుగా

ఆరని జ్వాలలలో ఆగని జయములతో

మారని ప్రేమ సమర్పణతో

సర్వత్ర యేసుని కీర్తింతుము (2)

4. పరిశుద్దాత్మునికై ప్రార్థన సలుపుదము

పరమాత్ముని రాక బలము ప్రసాదింప

ధరణిలో ప్రభువును జూపుటకై

సర్వాంగ హోమము జేయుదము (2)

5. అనుదిన కూటములు అందరి గృహములలో

ఆనందముతోను ఆరాధనలాయే

వీనుల విందగు పాటలతో

ధ్యానము చేయుచు మురియుదము (2)

6. హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ  – గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర

భీతులలో బహు రీతులలో – నూతన లోకము కాంక్షింతుము (2)

Devuni Vaarasulam Prema Nivaasulamu)