దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)
1. ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని||
2. చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)
సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని||
3. నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2) ||దేవుని||
4. తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2) ||దేవుని||
5. నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2) ||దేవుని||
6. పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర – సంపన్నుడు – నా దేవుడు (2) ||దేవుని||
7. స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2) ||దేవుని||
(Devuniyandu Nireekshananunchi)