జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా

జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో (2)

1. సర్వ సమయములలో నీ స్తుతి గానం
ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం (2)
మాకదియే మేలు ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||

2. సృష్టినంతటిని నీ మాట చేత
సృజియించితివిగా మా దేవ దేవా (2)
నీ ఘనమగు మహిమ వర్ణింప తరమా
స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||

3. కలుషాత్ములమైన మా కొరకు నీ
విలువైన ప్రాణంబు నర్పించితివిగా (2)
కల్వరి గిరిపై చూపిన ప్రేమన్
స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||

(Jeevithamanthaa Nee Prema Gaanam Pranuthinthumo Memu Devaa)